సింగపూర్‌లోని ప్రఖ్యాత నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో( National University of Singapore ) యూకేలో స్థిరపడిన భారత సంతతికి చెందిన విద్యావేత్త జస్జిత్ సింగ్( Jasjit Singh ) విజిటింగ్ ఫ్యాకల్టీగా నియమితులయ్యారు.సిక్కు మత విశ్వాసాలపై ఉపన్యాసాలు నిర్వహించడం, అంతర్జాతీయంగా సిక్కుల జీవన విధానంపై విద్యార్ధులకు అవగాహన కల్పించడం ఆయన విధి.
51 ఏళ్ల జస్జిత్ సింగ్ ప్రస్తుతం యూకేలోని లీడ్స్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.సిక్కు అధ్యయనాలపై ఆయనకు అపార అనుభవం వుంది.
సింగ్ నియామకంపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ లియోనెల్ వీ( Professor Lionel Wee ) మాట్లాడుతూ.జస్జిత్ సిక్కు మత విశ్వాసాలు, అభ్యాసాలపై వర్సిటీలోని ఫ్యాకల్టీకి మరింత అవగాహన కల్పిస్తారని చెప్పారు.
సెంట్రల్ సిక్కు గురుద్వారా బోర్డ్ (సీఎస్‌జీబీ) సిక్కు అధ్యయనాలపై విజిటింగ్ ప్రొఫెసర్‌గా సింగ్ నియామకాన్ని బుధవారం ప్రకటించింది.భారత ఉపఖండం వెలుపల , ఆసియాలో మొట్టమొదటి విజిటింగ్ ప్రొఫెసర్‌షిప్ (ఛైర్), NUS FASS ఏర్పాటు చేయడం కోసం సీఎస్‌జీబీ 1.06 మిలియన్ సింగపూర్ డాలర్ల ఎండోమెంట్ ఫండ్‌ను సేకరించింది.
2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆగస్ట్ 7న FASSలో జస్జిత్ సింగ్ సెమిస్టర్‌ను ప్రారంభించారు.ఆయన ప్రస్తుతం ‘‘ ఇంట్రడక్షన్ టూ సిక్కిజం’’( Introduction to Sikhism ) పేరుతో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్‌ను బోధిస్తున్నారు.ఇక్కడ విద్యార్ధులు సిక్కు మతానికి సంబంధించిన బేసిక్ సిద్ధాంతాలు, వలస రాజ్యానికి ముందు , ఆ తర్వాత భారత్‌లో సిక్కు మత పరిస్ధితులపై తెలుసుకుంటారు.
అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కింద ‘‘ సౌత్ ఏషియా ఇన్ సింగపూర్ ’’, ‘‘వరల్డ్ రిలిజియన్స్’’ పైనా జస్జిత్ సింగ్ ఉపన్యాసాలను అందిస్తారు.
NUS FASS సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన డిజిటల్ సిక్కిజంపై పరిశోధనకు కూడా నాయకత్వం వహిస్తారు.దీనికి అదనంగా సిక్కు కమ్యూనిటీకి( Sikh Community ) వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తారు.నవంబర్ 2023లో సీఎస్‌జీవీ అండ్ ఎన్‌యూఎస్ ద్వారా బహిరంగంగా ఉపన్యాసం అందించబడుతుంది.
తన నియామకం గురించి జస్జిత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy