మెడ ఎంత నల్లగా ఉన్నా సరే ఈ సింపుల్ చిట్కాతో తెల్లగా మెరిపించుకోండి!

సాధారణంగా కొందరి మెడ ముఖం కంటే తక్కువ రంగును కలిగి ఉంటుంది.ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను అధికంగా ఫేస్ చేస్తుంటారు.

ప్రెగ్నెన్సీ, హార్మోన్ చేంజ్, శరీరంలో అధిక వేడి, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకు పోవడం, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంది.దాంతో మెడ నలుపును వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

తోచిన చిట్కాలు అన్నీ పాటిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? డోంట్ వ‌ర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే చాలా వేగంగా మెడ న‌లుపును వ‌దిలించుకోవ‌చ్చు.

సులభంగా న‌ల్ల‌టి మెడ‌ను తెల్లగా మెరిపించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి.? అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు షుగర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడపై అప్లై చేసుకుని.

నిమ్మ‌ చెక్కతో స్మూత్ గా చ‌ర్మాన్ని స్క్రబ్ చేసుకోవాలి.కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని.

ఆపై పది నిమిషాల పాటు మెడను ఆరబెట్టుకోవాలి.అనంతరం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే క‌నుక‌ మెడ నలుపు క్రమంగా పోతుంది.డార్క్ నెక్‌ కొద్ది రోజుల్లోనే తెల్లగా మరియు మృదువుగా మారుతుంది.కాబట్టి ఎవ‌రైతే మెడ నలుపుతో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారో వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు