బ్రేకింగ్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‎పై స్టేకు హైకోర్టు నిరాకరణ

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ మేరకు మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.

మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ సుమారు 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏం కాదని తెలిపింది.

హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయాలు ఏళ్ల తరబడి ఊగిసలాడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Advertisement
అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

తాజా వార్తలు