బ్రేకింగ్: ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు సమీప ప్రాంతాల్లో ఆకస్మాతుగా భూమి కంపించింది.

దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.కాగా రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.4గా నమోదు అయిందని అధికారులు తెలిపారు.రెండు రోజుల కిందట కూడా ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

నోయిడా, ఘజియాబాద్ వంటి పలు ఉత్తరాది ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.భూకంప కేంద్రం నేపాల్ లో భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో వరుస భూకంపాలతో ఢిల్లీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement
Bet Plays Mobile App And Mobile Experience : A Practical Guide For Canadian Players