బ్రేకింగ్: వాలీబాల్ టోర్నమెంట్‎లో వివాదం.. అనకాపల్లి జిల్లాలో ఉద్రిక్తత

అనకాపల్లి జిల్లాలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్ లో వివాదం చెలరేగింది.మాకవరపాలెం మండలం జి.

నగరంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు.ఇరు వర్గాల మధ్య వివాదం కాస్త ముదరడంతో ఘర్షణకు దారితీసింది.

దీంతో ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడ్డారు.ఈ క్రమంలోనే తీర్థం జరిగే సమయంలో ఒక వర్గం సభ్యులు వెళ్లగా వారిపై రెండో వర్గం దాడి చేసిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఘటనతో సంబంధం లేని ఓ యువకుడు గాయపడ్డాడు.వెంటనే బాధితుడిని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement