సింగపూర్( Singapore ) అంటేనే గుర్రపు పందేలకు ప్రసిద్ధి గాంచినది.అలాంటిది అక్కడ గుర్రపు పందేలు ఇక జరగవు అంటే ఎలావుంటుంది? ఊహించుకోవడం ఒకింత కష్టమే.
అయితే 180 ఏళ్ల గుర్రపు పందేల సుదీర్ఘ చరిత్రకు అక్కడ బ్రేక్ పడనుంది.ఈ ఆగ్నేయాసియా దేశంలోని ఏకైక రేస్‌కోర్సు అయిన సింగపూర్ టర్ఫ్ క్లబ్( Singapore Turf Club ) వచ్చే ఏడాది దాని చివరి గుర్రపు పందెం నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించి సంచలనం సృష్టించింది.120 హెక్టార్ల రేస్ కోర్సు స్థలాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హౌసింగ్ నిర్మాణాల కోసం సింగపూర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
క్వీన్ ఎలిజబెత్ II ( Queen Elizabeth II )పేరు మీద ఈ రేసు మొట్ట మొదట ప్రారంభమైంది.ఆమెకు రేసు గుర్రాలు పెంచడం, గుర్రపు పందేలు అంటే విపరీతమైన ఆసక్తి.1972లో రాణి సింగపూర్ పర్యటన సందర్భంగా మొదటి క్వీన్ ఎలిజబెత్ II కప్‌ను అందించారు.ఆమె 2006లో 2వసారి ఈ ఫీచర్ రేస్‌కు హాజరయ్యారు.
"సింగపూర్‌లో గుర్రపు పందేలకు సుదీర్ఘ, విశిష్టమైన చరిత్ర ఉంది" అని సింగపూర్ టర్ఫ్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సందర్భంగా "2024 అక్టోబరు 5న జరిగే 100వ గ్రాండ్ సింగపూర్ గోల్డ్ కప్ వరకు రేసులు కొనసాగుతాయి.
క్లబ్ ప్రతి రేసు క్రీడాస్ఫూర్తి, భద్రత, సమగ్రతను కొనసాగిస్తుంది" అని తెలిపింది.
ఇకపోతే, స్కాటిష్ వ్యాపారి విలియం హెన్రీ మాక్లియోడ్ రీడ్,( Henry MacLeod Reid ) పలువురు ఔత్సాహికులు 1842లో సింగపూర్ స్పోర్టింగ్ క్లబ్‌ను స్టార్ట్ చేసారు.ఈ నేపథ్యంలో సెంట్రల్ సింగపూర్‌లోని ఫారర్ పార్క్‌లో కొద్దిగా చిత్తడిగా ఉన్న నేలను వారు రేస్‌కోర్స్‌గా తీర్చిదిద్దారు.1924లో ఈ స్థలాన్ని సింగపూర్ టర్ఫ్ క్లబ్‌గా మార్చారు.కాగా గుర్రపు పందేలను ఇపుడు యూరోపియన్లనే కాకుండా సంపన్నులైన మలేసియా, చైనీస్ వాసులను కూడా ఆకర్షిస్తున్నాయి.1933లో సెంట్రల్ సింగపూర్‌లో గుర్రపు పందేలకు జనాదరణ పెరగడంతో, ఈ కోర్సు పశ్చిమ సింగపూర్‌లోని బుకిట్ తిమాహ్ వద్దగల భారీ ప్రదేశానికి మార్చారు.సింగపూర్ టర్ఫ్ క్లబ్ 2000 మార్చిలో ఈ ద్వీపానికి ఉత్తరాన ఉన్న ప్రస్తుత క్రాంజి స్థానానికి మారింది.
దాదాపు 3 వేల కోట్ల రూపాయల విలువ గల ఈ రేస్‌కోర్స్ ఐదు అంతస్తుల గ్రాండ్‌స్టాండ్‌ను కలిగి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy