జైలు గదిలోనే ఉరేసుకున్న డ్రగ్ డాన్!

అడ్డదారులు తొక్కితే జీవితం అర్ధాంతరంగానే ముగిసిపోతుంది అని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ గా చెప్పాలి.

బ్రెజిల్ డ్రగ్ డాన్ గా పేరు పొందిన క్లావినో డా సిల్వా జైలు గదిలో విగతజీవిలా కనిపించాడు.

డ్రగ్ మాఫియా కు సంబంధించి క్లావినో కు 73 సంవత్సరాల కారాగారం విధించింది.అయితే దీనితో జైలు లోనే జీవితం గడుపుతున్న అతడికి జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించాడు.

ఈ క్రమంలో తన సొంత కూతురిని కూడా ఉపయోగించుకున్నాడు.ఈ క్రమంలోనే అతడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడం తో ప్రపంచ వ్యాప్తంగా అతడు బాగా ఫెమస్ అయిపోయాడు.

అసలు విషయం ఏమిటంటే రియో జైలు లో శిక్ష అనుభవిస్తున్న సిల్వా ను కలిసేందుకు అతడి కుమార్తె జైలు కు వెళ్ళింది.అయితే బంధువులు,ఖైదీలు కలుసుకునే గదిలోకి వెళ్లి తండ్రితో మాట్లాడి కొద్దీ సేపటి తరువాత బయటకు వచ్చింది.

Advertisement

అయితే పోలీసులకు అనుమానం కలిగి తనిఖీ చేయగా అప్పుడు విషయం బయటకు వచ్చింది.జైలు లోపల కి కూతురు వెళ్లగా,బయటకు వచ్చింది మాత్రం సిల్వా గా గుర్తించారు.

అచ్చం కూతురిని తలపించేలా సిలికాన్ మాస్క్,జుట్టు తో పాటు ఆమె దుస్తులను కూడా ధరించి జైలు సిబ్బంది కళ్లు గప్పి పారిపోవాలని ప్రయత్నించాడు.అయితే మొత్తానికి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం తో అతడు పోలీసులకు చిక్కిపోయాడు.

ఈ క్రమంలో అతడు మాస్క్ తొలగిస్తున్న వీడియో అప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఈ ఒక్క వీడియో తోనే సిల్వా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఫెమస్ అయిపోయాడు.అయితే ఇతడు మంగళవారం జైలు గదిలో విగతజీవిలా కనిపించడం తో అధికారులు నిర్ఘాంతపోయారు.73 సంవత్సరాల కారాగారం విధించడం, ఇప్పటికే జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవడంతోనే అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!
Advertisement

తాజా వార్తలు