బ్ర‌హ్మోస్ క్షిప‌ణి మిస్ ఫైర్.. అధికారుల‌పై వేటు

బ్ర‌హ్మోస్ క్షిప‌ణి మిస్ ఫైర్ అయిన ఘ‌ట‌న‌లో ముగ్గురు వాయుసేన అధికారుల‌పై ప్ర‌భుత్వం వేటు వేసింది.నియ‌మావ‌ళి పాటించ‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని పేర్కొంది.

ఈ నేప‌థ్యంలో గ్రూప్ కెప్టెన్ తో పాటు ఇద్ద‌రు వింగ్ క‌మాండ‌ర్ల‌ను విధుల నుంచి త‌ప్పించిన స‌ర్కార్.ఇది త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

అయితే, ఈ ఏడాది 9న పంజాబ్ లోని అంబాలా వాయుసేన స్థావ‌రం నుంచి బ్ర‌హ్మోస్ మిసైల్ ఒక‌టి ప్ర‌మాద‌వ‌శాత్తు గాల్లోకి దూసుకెళ్లింది.ఇది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ప‌డ‌టంతో స్వ‌ల్ప ఆస్తి న‌ష్టం వాటిల్లిన సంగ‌తి తెలిసిందే.

మిసైల్ మిస్ ఫైర్ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌ర‌ప‌డం కోసం ప్ర‌భుత్వం కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది.ఈ క్ర‌మంలో ఆ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌లో స్టాండింగ్ ఆప‌రేట‌ర్ ప్రొసీజ‌ర్స్ లో మూడు తేడాలు ఉన్న‌ట్లు గుర్తించింది.

Advertisement

క్షిప‌ణులు నిర్వ‌హ‌ణలో నియ‌మావ‌ళిని పాటించ‌క‌పోవడ‌మే కార‌ణ‌మ‌ని తేల్చి చెప్పింది.అందుకు ముగ్గురు అధికారులదే బాధ్య‌త అని చెప్పింది.

ఈ మేర‌కు ప్ర‌భుత్వం నివేదిక ఆధారంగా అధికారుల‌ను విధుల నుంచి తొల‌గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు