ప్రస్తుత కాలంలో యువకులు, యువతులు మొబైల్ ఫోన్లో మెసేజ్లు చేసుకోవడం మామూలు విషయమే.
అయితే కొంతమంది యువకులు అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు చాలానే చూసాము.
ఇలాంటి సమయంలో కొందరు మాటలతో సర్ది చెబుతుంటే.మరికొందరు తమ వారి జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడడం లేదు.
ప్రస్తుత యువత తమకంటే తోపు ఎవరూ లేరు అన్నట్లుగా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు.కొందరైతే, ఏకంగా తనకు నచ్చిన అమ్మాయి నాదే అంటూ,, ఆ అమ్మాయిని చూడద్దు అంటూ తోటి వారితో గొడవలు పడుతుంటారు కూడా.
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో( Ambedkar Konaseema District ) చోటుచేసుకుంది.
ఇక అసలు విషయానికి వెళ్తే.ఒక యువకుడిని నలుగురు యువకులు నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్లారు.అక్కడ మొదట మామూలుగా మాటలతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు.
అంతేకాదు ఆ యువకుడి బట్టలు చింపేసి కొబ్బరి మట్టతో అతడిపై దాడి చేశారు.ఈ దాడి జరిగి కొద్ది రోజులు గడుస్తున్న తాజాగా ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతుంది.
ఈ ఘటనలో బాధితుడు మలికిపురంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.అయితే ఆ యువకుడు ఓ యువతకి మెసేజ్( Message ) చేసిన విషయంలో వారి మధ్య ఈ వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
మొదట ఆ యువకుడ్ని మాట్లాడుకుందాం అని చెప్పి నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి అతడిని దారుణంగా కొట్టారు.ఇష్టం వచ్చినట్లు బూతులు సైతం మాట్లాడుతూ.అతడిని కొబ్బరి మట్టతో కొట్టారు.
అంతేకాదు ఈ ఘటన మొత్తాన్ని వీడియోలో రికార్డ్ చేశారు.ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద దుమారం చెలరేగుతుంది.
ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.అయితే ఈ దాడికి పాల్పడిన వారిలో ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఆ ఘటనలో ఆ యువకుడికి ముఖం చుట్టూ కుట్లు కూడా పడినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy