మోసపోయి..చితకొట్టాడు!!

ప్రొఫైల్‌లో తన అసలు ఫోటో పెట్టనందుకు ఓ మహిళను ఓ వ్యక్తి కొట్టాడు.దెబ్బలు తిన్న ఆ మహిళ వయస్సు 32.

ఆమె తరుచూ ఓ వ్యక్తితో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా చాటింగ్ చేసేది.అయితే, ప్రొఫైల్‌లో తన ఇమేజ్ మాత్రం వేరేది పెట్టింది.

అనంతరం వారు ఇటీవల మొదటిసారి కలుసుకున్నారు.ఆమెను చూసిన అతను షాకయ్యాడు.

ప్రొఫైల్‌లో చూసినట్లుగా లేకపోవడంతో ఆమెను కొట్టాడు.ఆమె పేరు జియోజిన్ తాన్.

Advertisement

కొట్టిన వ్యక్తి పేరు హాంగ్ మావ్.తరుచూ ఆన్ లైన్లో మాట్లాడుకున్న అనంతరం ఓ రోజు కలుద్దామనుకున్నారు.

ప్రొఫైల్‌లో ఇమేజ్ చూసిన అతను ఆమెను ఎప్పుడెప్పుడు చూస్తానా అని తహతహలాడాడు.ఆమె దేవకన్యగా కనిపించడంతో ఆనందభరితుడయ్యాడు.

దేవకన్యగా ఉండటంతో ఆమెను కలుసుకునేందుకు ఏకంగా 8వేలకు పైగా డాలర్లు ఖర్చు చేశాడు.ఈస్ట్ చైనాలోని ఆమె ఊరికి వచ్చాడు.

అతను రెస్టారెంటులో వెయిట్ చేస్తున్న సమయంలో లావుపాటి ముఖంతో, మొటిమలు కలిగిన ఓ మహిళ వచ్చి అతని పక్కన కూర్చుంది.అతనిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చింది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

అతని మదిలో మాత్రం దేవకన్యలాంటి ఆ ప్రొఫైల్ ఇమేజ్ ఉంది.ఆమె వచ్చి తానేనని చెప్పడంతో.

Advertisement

ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.వెంటనే ఆమె ముఖం పైన ఒక్క పంచ్ ఇచ్చాడు.

ఆమె ఫ్లోర్ పైన పడిపోయింది.అమెను తొక్కాడు.

వీరిద్దరిని హోటల్ స్టాఫ్ విడదీశారు.ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఇలాంటివి మనదేశంలో కూడా జరుగుతూ ఉండడం విచారకర విషయం అంటున్నాయి మీడియా వర్గాలు.

తాజా వార్తలు