రామ్ పోతినేని - బోయపాటి మూవీ గ్రాండ్ లాంచ్.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను.

ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

ఒక్కో సినిమా యాక్షన్ మరీ ఎక్కువ అయ్యి ప్లాప్స్ ఎదురైనా ఈయనకు మాగ్జిమమ్ హిట్ లే వచ్చాయి.ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.

అఖండ సినిమాతో ఘన విజయం అందుకుని హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు.

ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.

Advertisement

వెంటనే బోయపాటి తో షూట్ లో పాల్గొనబోతున్నాడు రామ్.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాను ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ చేసారు.

రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈ గ్రాండ్ లాంచింగ్ లో చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

బూరుగుపల్లి శివరామ కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ ఫస్ట్ క్లాప్ కొట్టారు.

ఇక ఎన్ లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ ను అందించారు.బోయపాటి ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేసారు.త్వరలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాను సౌత్ లో భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదల కానుంది.

Advertisement

మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.