తల్లిని పాము నుంచి కాపాడిన బాలుడు.. ఇంతలోనే అంతులేని విషాదం..!

అతడి వయసు 5 ఏళ్లే కానీ తల్లిని కాపాడేందుకు తన ప్రాణాలనే వదిలేశాడు.

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం, తూత్తుకుడి జిల్లా, సౌత్​ కుప్పనపురం గ్రామంలో ఆగస్టు 19న చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.పెరుమాల్​ అనే వ్యక్తి సౌత్​ కుప్పనపురం ఊరిలో అతని భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.

అయితే వీరికి ఒక ఐదేళ్ల బాలుడు ఉన్నాడు.ఈ బాలుడికి తన తల్లి అంటే ఎంతో ఇష్టం.

ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉండే వాడు.అయితే శుక్రవారం తన తల్లి వంటగదిలో వంట చేస్తుండగా.

Advertisement

గోడ పక్కన ఉన్న ఒక బొక్కలోనుంచి ఒక పెద్ద పాము రావడం కనిపించింది.దాంతో ఒక్కసారిగా అతడు భయపడిపోయాడు.

అయితే ఆ రంధ్రానికి తల్లి చాలా దగ్గరలోనే ఉంది.దాంతో పాము తన తల్లిని ఎక్కడ కాటేస్తుందో ఏమోనని అతడు ఇంకా భయపడిపోయాడు.

అందుకే ధైర్యం చేసి ఆ పాముని అడ్డుకున్నాడు.ఈ సమయంలో ఆ విషసర్పం అతడిని కాటువేసింది.

మరుక్షణమే ఆ చిన్నారి సృహ తప్పి కింద పడిపోయాడు.దీన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కోసం బాలుడిని కదంబుర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

అక్కడ కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించగలిగారు.బాలుడి పరిస్థితి మరింత విషమంగా మారడంతో తిరునెల్వేలిలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు.

Advertisement

అయితే దురదృష్టం కొద్దీ ఆ బాలుడు అప్పటికే చనిపోయాడు.ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు.

దాంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ కి వెళ్లి బాలుడి భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆపై పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఒక పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించాడు.

తాజా వార్తలు