బొత్స అసహనానికి పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యతే కారణమా?

బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) దేశం మొత్తం తెలిసిన నాయకుడు .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్ గానే కాదు, ఒక దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరును పరిశీలించారంటే ఆయన స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

ఉత్తరాంధ్ర రాజకీయాలను తన కనుసనలో నడిపే నాయకుడిగా ఆయన పేరుగాంచారు.కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ప్రజల సాధక బాధకాలకు వెనువెంటనే స్పందించే నాయకుడిగా ఉండడంతో దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు.

తూర్పు కాపులు ఈయనను తమ కుల పెద్దగా కూడా భావిస్తారు .వైయస్ హయాం లో భారీ పరిశ్రమల శాఖతో పాటు అనేక కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఆయన వైఎస్ మరణం, రాష్ట్ర విభజన తదనంతట పరిణామాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పురపాలక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

Botsa Not Happy With Ysrcp , Botsa Satyanarayana , Ysrcp , Ys Jagan, Ap Politic

మొదట్లో బొత్స సత్యనారాయణకు కీలక ప్రాధాన్యత ఇచ్చిన వైసిపి అధిష్టానం రాను రాను ఆయనకు ప్రాధాన్యత తగ్గించిందని,, అంతగా ప్రాముఖ్యత లేని విద్యాశాఖను కట్టబెట్టిందనే అసంతృప్తి ఆయనకు ఉందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి .అయితే అవన్నీ ఊహగానాలు అని కొట్టి పారేసిన ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా ఆక్టివ్ గా పనిచేశారు.అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో( MLC election ) వైసీపీ అభ్యర్థుల పరాజయం తర్వాత పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత పై ఆయనకు అసంతృప్తి ఉందని అది నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో బయటపడిందని చెప్తున్నారు.

Botsa Not Happy With Ysrcp , Botsa Satyanarayana , Ysrcp , Ys Jagan, Ap Politic
Advertisement
Botsa Not Happy With Ysrcp , Botsa Satyanarayana , Ysrcp , Ys Jagan, Ap Politic

ఆసరా చెక్కుల పంపిణీ( YSR Asara ) కార్యక్రమం కోసం శృంగవరపుకోటకు వెళ్ళిన ఆయనకు అక్కడ పట్టణ వైసీపీ నాయకులు అక్కడ ఎమ్మెల్సీ నాయకుడి మీద స్థానిక ప్రజాప్రతినిధి మీద ఫిర్యాదు చేశారట.పార్టీని ఓడించిన వారికి పట్టం కడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వారికే మద్దతు ఇస్తున్నారు అంటూ పట్టణ నాయకుడు రెహమాన్ బొత్స కు ఫిర్యాదు చేశారంట.మొదట్లో సర్ది చెప్పినప్పటికీ మా బాధలు పట్టించుకోరా అంటూ కారు దగ్గరికి వచ్చి మరి నిలదీసిన తీసిన రెహమాన్పై బొత్స ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారనీ సమాచారం .బాధలు ఎవరికి లేవని, మాకు అందరికీ బాధలు ఉన్నాయని అయితే ఇలా క్రమశిక్షణ ఉల్లంఘించి బహిరంగంగా పార్టీ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారట.ఏదైనా ఉంటే విజయనగరం వచ్చి కలవాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారట .పార్టీపై ఉన్న అసంతృప్తితో ఆయన అలా మాట్లాడాలని తన స్థాయికి తగిన ప్రాముఖ్యత పార్టీలో దొరక తగ్గడం లేదని ఆయన భావిస్తున్నారని , అందుకే ఆయన ఆ రకంగా వ్యాఖ్యలు చేశారని రకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయి। .

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు