బోండా ఉమ ఎన్నికల అఫిడవిట్ తప్పులతడక..: వెల్లంపల్లి

విజయవాడ( Vijayawada )లో టీడీపీ నేత బోండా ఉమ, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా బోండా ఉమపై వెల్లంపల్లి( Vellampalli Srinivas) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బోండా ఉమ( Bonda Umama ) ఎన్నికల అఫిడవిట్ తప్పులతడకని వెల్లంపల్లి ఆరోపించారు.అధికారులను తప్పుదోవ పట్టించి ఓట్లను నమోదు చేయించుకున్నారన్నారు.

సింగ్ నగర్ టీడీపీ కార్యాలయం అడ్రస్ తో ఓట్లు నమోదు అయ్యాయని వెల్లంపల్లి తెలిపారు.ఎన్నికల నియమావళి ప్రకారం ఇంటి చిరునామాతోనే ఓట్లు ఉండాలని చెప్పారు.

ఒక దగ్గర నివసిస్తూ బోండా ఉమ మరో చోట పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత బోండా ఉమకు లేదని చెప్పారు.

Advertisement

బోండా ఉమ ఓటు తొలగించే వరకు పోరాడుతానని తెలిపారు.బోండా ఉమపై ఉన్న కేసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు