హైదరాబాద్ చార్మినార్ వద్ద బాంబు కలకలం

హైదరాబాద్ చార్మినార్ వద్ద బాంబు కలకలం చెలరేగింది.చార్మినార్ దగ్గర బాంబ్ పెట్టామని గుర్తు తెలియని అగంతకులు పోలీసులుకు ఫోన్ లో సమాచారం ఇచ్చారు.

దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం.బాంబ్ స్క్వాడ్ తో చార్మినార్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఫుట్ పాత్ వ్యాపారులను ఖాళీ చేయించి బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తనిఖీలు అనంతరం బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ నిర్ధారణకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.దీంతో ఫేక్ కాల్ గా నిర్ధారించిన పోలీసులు.కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు.

తాజా వార్తలు