ప్రభాస్ సినిమా వస్తుంది అంటే పక్కకు తప్పుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు

ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ప్రభాస్( Prabhas ) అని చెప్పక తప్పదు.

ఆయన సినిమాలు విజయం సాధించిన, పరాజయం పొందిన ఖచ్చితంగా 300 కోట్ల వసూళ్లు సాధిస్తూ వస్తున్నాయి.

అందుకే బాలీవుడ్ హీరోలను సైతం పక్కకు వెళ్లిపోయారు ప్రభాస్ క్రేజ్ ముందు.ఇంతకుముందు కేవలం టాలీవుడ్ కి లేదా సౌత్ ఇండియాకి మాత్రమే పరిమితమైన ప్రభాస్ రేంజ్ బాహుబలి( Baahubali ) సినిమా తర్వాత ఆకాశాన్ని అంటింది.

తనదైన స్టైల్ లో సినిమాలు తన క్రేజ్ ని అంతకంతకు పెంచుకుంటూ వెళుతున్నాడు ప్రభాస్.ఇక ప్రభాస్ విషయంలో చెప్పుకోదగ్గ మరొక విషయం ఏమిటి అంటే బాహుబలి తర్వాత పెద్దగా విజయాలు ఏమీ లేవు అయినా కూడా అతని క్రేజ్ లో ఎలాంటి మార్పు లేదు.

ఇప్పుడు ప్రభాస్ స్టామినా ముందు బాలీవుడ్ హీరోలు( Bollywood Heroes ) అందరూ కూడా పక్కకు తప్పుకుంటున్నారు.ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు దాని విడుదల డేట్ ఏంటో తెలుసుకుని దానికి దరిదాపుల్లో కూడా వారి సినిమాని లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారట.ప్రభాస్ ని తట్టుకొని నిలబడటం తమ సినిమాల వల్ల కాదు అని అనఫిషియల్ గా డిక్లేర్ చేసేశారు బాలీవుడ్ స్టార్ హీరోలంతా.

Advertisement

ఉదాహరణకు షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నటించిన డంకీ సినిమాని( Dunki Movie ) తీసుకుంటే ఈ సినిమా సలార్( Salaar ) సినిమా ఒకేసారి విడుదలయ్యాయి.డంకీ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని కాకపోయినా యావరేజ్ గా పర్వాలేదనిపించుకుంటే, అదే సమయంలో సలార్ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

దాంతో షారుక్ లాంటి బాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరో కూడా ప్రభాస్ ముందు తేలిపోయాడు.ఆ తర్వాత మరో స్టార్ హీరో ప్రభాస్ సినిమా టైంలో విడుదల చేయాలని అనుకోవడం లేదట.ఇప్పుడు ప్రభాస్ కల్కి ( Kalki ) మరియు రాజా సాబ్( Rajasaab ) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

దాంతో మరోసారి బాలీవుడ్ హీరోలందరూ అలర్ట్ అయ్యారు.ఈ రెండు సినిమాల విడుదల తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.మరీ ముఖ్యంగా అజయ్ దేవగన్( Ajay Devgan ) హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సింగం అగైన్( Singham Again ) అనే సినిమా కేవలం ప్రభాస్ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

దాని తేదీ ప్రకటిస్తే తప్ప వీరు ఈ సినిమాని విడుదల చేయకూడదు అని నిర్ణయించుకున్నారట.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు