Ameesha Patel: చెక్ బౌన్స్ కేసులో లొంగిపోయిన బాలీవుడ్ నటి.. ముసుగేసుకుని దొంగలా అలా?

ఇటీవల కాలంలో బాలీవుడ్( Bollywood ) లో చాలామంది హీరోయిన్ లు ఏదో ఒక కేసులో అరెస్ట్ అవ్వడం లేదంటే కోటికి వెళ్లడం పోలీస్ స్టేషన్కు వెళ్లడం లాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.

ఎక్కువగా హీరోయిన్ల పై కేసులో నమోదు అవుతున్నాయి.

మరి ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్( Ameesha Patel ) కూడా ఒక కేసులో ఇరుక్కుంది.

ఆ కేసులో భాగంగా తాజాగా ఆమె కోర్టులో సరెండర్ కూడా అయ్యింది.

తాజాగా జూన్ 17న ఉదయం రాంచి సివిల్‌ కోర్టులో ఆమె లొంగిపోయింది.సినిమా నిర్మాత, వ్యాపారవేత్త అజయ్‌ కుమార్‌, అమీషా పటేల్‌ పై చెక్‌ బౌన్స్‌ కేసు వేశాడు.దాంతో ఆమె కోర్ట్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే గతంలో సినిమా నిర్మిస్తానంటూ అమీషా పటేల్ తన దగ్గర 2.5 కోట్లు అప్పుగా తీసుకుందని, ఆ తర్వాత ఆమె సినిమా పూర్తిచేయలేదని, తన డబ్బు తనకు తిరిగి ఇవ్వలేదని అజయ్‌ కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.అసలు .2.5 కోట్లకు వడ్డీ 50 లక్షలు కలిపి మొత్తం 3 కోట్లు ఇప్పించాలని ఆయన కోర్టును కోరాడు.

Advertisement

ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఏప్రిల్‌ నెల 6న అమీషాకు వారెంట్‌ ఇష్యూ చేసింది.ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు కోర్టులో లొంగిపోయింది.అనంతరం కోర్టు ఆమె షరతులతో కూడిన బెయిల్‌ కూడా మంజూరు చేసింది.

దాంతో కోర్టు బయటికి వచ్చిన ఆమె వెంటనే స్పీడ్ గా స్పందించి తలకు ముసుగు కప్పకుంది.మీడియాను చూసి తలకు ముసుగు కప్పుకుంది.కోర్టులో ఏం జరిగిందో చెప్పమని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించినా ఆమె పట్టించుకోకుండా కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అయితే ఆమె కోట్ల నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో అలా మీడియాను చూసి ముసుగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలు వీడియోలు చూసిన అభిమానులు నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు