బాలీవుడ్‌ మీడియా అతి ప్రచారం.. సౌత్ సినిమాల రికార్డులపై తప్పుడు ప్రకటనలు

ఒకప్పుడు సౌత్ సినిమా లు అంటే బాలీవుడ్‌( Bollywood ) ప్రేక్షకులు పెద్దగా పట్టింపు ఉన్నట్లుగా వ్యవహరించే వారు కాదు.కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

హిందీ సినిమా ల కంటే కూడా అధికంగా తెలుగు సినిమా లను తమిళ, మలయాళ సినిమా లను కన్నడ సినిమా లను ఇష్టపడుతున్నారు.కనుక బాలీవుడ్ వారికి కడుపు మంటగా ఉన్నట్లుంది.

అందుకే పదే పదే సౌత్ సినిమా ల రికార్డు లను ఫేక్ అంటూ ప్రచారం చేయడం తో పాటు సౌత్ స్టార్స్ ను చిన్న చూపు చూస్తూ విమర్శలు చేయడం చేస్తున్నారు.తాజాగా హిందీ లో గదర్ 2( Gadar 2 ) విడుదల అయిన విషయం తెల్సిందే.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే దంగల్ కే సాధ్యం కాని బాహుబలి 2( Baahubali 2 ) రికార్డ్ ను గదర్ 2 సినిమా బ్రేక్ చేసింది అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం మొదలు పెట్టింది.ఇదిగో అదుగో అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యం లో అసలు ఏం జరుగుతుంది అంటూ తెలియక కొందరు గందరగోళం కు గురి అవుతున్నారు.

Advertisement

నిజంగా నే బాలీవుడ్ మీడియా ప్రచారం చేసినట్లుగా గదర్ 2 సినిమా బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిందా అంటూ కొందరు చర్చించుకోవడం కనిపిస్తోంది.బాలీవుడ్‌ లో ఈ రేంజ్ సక్సెస్ ను చాలా మంది కనీసం ఊహించలేదు.

ఈ మధ్య కాలం లో చాలా సినిమా లు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుచుతున్నాయి.అయినా కూడా గదర్ 2 సినిమా వందల కోట్లు ఎలా సాధిస్తుందో అర్థం కావడం లేదు అంటూ కొందరు బాక్సాఫీస్ వర్గాల వారు అంటే కొందరు మీడియా వారు మాత్రం అంతకు మించి అంటూ అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు.

ఈ విషయం లో బాలీవుడ్ మీడియా కి ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కలిశారు.దాంతో బాలీవుడ్‌ మీడియా ఇష్టానుసారంగా సౌత్ సినిమా లపై ఆడి పోసుకుంటూ రికార్డులు అన్నీ కూడా ఫేక్‌ అన్నట్లుగా కూడా ప్రచారం చేస్తున్నారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు