వామ్మో.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆస్తి అన్ని కోట్లా..?

తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస ఆఫర్లతో కత్రినా కైఫ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాల్లో నటించిన కత్రినా కైఫ్ ఆ సినిమా తరువాత టాలీవుడ్ కు దూరమయ్యారు.

ఒకవైపు అభినయంకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూనే గ్లామర్ రోల్స్ ను కూడా పోషించి సత్తా చాటిన కత్రినా కైఫ్ డ్యాన్స్ కూడా అద్భుతంగా చేయగలరనే సంగతి తెలిసిందే.ఈరోజు కత్రినా కైఫ్ పుట్టినరోజు కాగా ఈ హీరోయిన్ తన ప్రతిభతో, సినిమాలతో బాగానే ఆస్తులు సంపాదించారని సమాచారం.

ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.సినిమాలతో పాటు యాడ్స్ చేయడం ద్వారా కూడా ఈ బ్యూటీ బాగానే సంపాదిస్తున్నారు.

ముంబైలో కత్రినా కైఫ్ కు ఖరీదైన ఇల్లు ఉందని ఈ ఇంటి విలువ 8 కోట్ల రూపాయలని సమాచారం.

Bollywood Heroine Katrina Kaif Property Details Here, 150 Crores , Bollywood , H
Advertisement
Bollywood Heroine Katrina Kaif Property Details Here, 150 Crores , Bollywood , H

లండన్ లో ఈ బ్యూటీ 7 కోట్ల రూపాయల విలువ చేసే భవంతి ఉందని సమాచారం.కత్రినా కైఫ్ మొత్తం ఆస్తుల విలువ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉండవచ్చని తెలుస్తోంది.కార్లంటే ఎంతో ఇష్టపడే కత్రినా కైఫ్ దగ్గర ప్రముఖ కంపెనీల కార్లు ఉన్నాయి.

కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవడం వల్లే కత్రినా కైఫ్ భారీ మొత్తంలో సులభంగా ఆస్తులను కూడబెట్టారని సమాచారం.

Bollywood Heroine Katrina Kaif Property Details Here, 150 Crores , Bollywood , H

కత్రినా కైఫ్ పేరుపై కోట్ల రూపాయల విలువ చేసే భూమి కూడా ఉందని సమాచారం.ప్రముఖ ఫిట్ నెస్ బ్రాండ్ రీబూక్ కు కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ ఆదాయాలతో పాటు మేకప్ బ్రాండ్ కే బ్యూటీ ద్వారా కత్రినా కైఫ్ కు అదనపు ఆదాయం చేకూరుతోందని తెలుస్తోంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు