ప్రభాస్ క్రేజ్ కి బాలీవుడ్‌ స్టార్స్ ఫీలింగ్‌ ఏంటో పాపం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో బాలీవుడ్ లో పాగా వేసిన విషయం తెలిసిందే.

బాహుబలి తర్వాత సాహో మరియు రాధేశ్యామ్‌ సినిమా లతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ రెండు సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.సాహో కాస్త బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసినా రాధేశ్యామ్‌ సినిమా దారుణంగా వసూళ్ల ను నమోదు చేసింది.

అయినా కూడా ఆయన కు ఉత్తర భారతం లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే.బాలీవుడ్ స్టార్ హీరో లకు సైతం ఆ రేంజ్ లో అభిమానులు లేరు.

తాజాగా అయోధ్య లో జరిగిన భారీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు.అయోధ్య లో జరిగిన కార్యక్రమం లో అభిమానులు చేసిన హంగామా అంతా అంతా కాదు.

Advertisement

కేవలం టీజర్ విడుదల వేదిక ముందు మాత్రమే కాకుండా నిన్నంతా అయోధ్య లో ప్రభాస్‌ రాక నేపథ్యం లో జరిగిన సందడి హంగామా అంతా అంతా కాదు.అదంతా చూస్తే బాలీవుడ్ స్టార్ హీరో ల మనసు ఒకింత చివుక్కుమనేలా ఫీల్‌ అవుతూ ఉంటారు అంటూ కొందరు ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియా లో ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు.హిందీ సినిమా లు పెద్దగా చేయని ప్రభాస్ కి ఎందుకు ఉత్తర భారతం లో ఇంతగా అభిమానుల ఫాలోయింగ్ అర్థం కావడం లేదంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్ లు చేస్తున్నారు.

ముందు ముందు అయినా వారి కామెంట్స్ కి సమాధానం లభిస్తుందేమో చూడాలి.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ఆదిపురుష్‌ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ తర్వాత కే జీ ఎఫ్‌ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.అంతే కాకుండా మహా నటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం లో రూపొందిన రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సినిమా కూడా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఇవి మాత్రమే కాకుండా రాజా డీలక్స్ మరియు స్పిరిట్ సినిమా లు కూడా చర్చల దశ లో ఉన్నాయనే విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు