సౌత్‌ దర్శకత్రయం... ప్రశాంత్ నీల్ ఎంట్రీతో బాలీవుడ్ మంట

ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ దర్శకులుగా ఉండే వారు.పెద్ద సినిమాలు.

పెద్ద హీరోలు.పెద్ద దర్శకులు.

అంటే బాలీవుడ్‌ వైపు చూసే వారు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

భారతదేశంలో అతి పెద్ద దర్శకులు ఎవరు.అత్యంత సక్సెస్ఫుల్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు.

Advertisement

ఎవరు భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే దర్శకులు ఎవరు అంటే.ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి, శంకర్, ప్రశాంత్ నీల్ పేర్లు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ముగ్గురు బాలీవుడ్ దర్శకుల పాతాళానికి తొక్కేస్తుంది.రాజమౌళి బాహుబలి మరియు ఆర్ఆర్ సినిమాలతో తన స్థాయిని అమాంతం పెంచుకున్నాడు.

మరోవైపు శంకర్ గత దశాబ్ద కాలంగా బాలీవుడ్ స్టార్ డైరక్టర్ లు సైతం కుళ్లుకునే విధంగా సినిమాలను చేస్తున్నాడు.తాజాగా ఈ ఇద్దరు స్టార్ దర్శకులకు తోడు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా చేరాడు.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తుంది.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టిన కేజీఎఫ్ 2 ని సినిమా చూసి బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ సైతం నోరు వెళ్లబెడుతున్నారు.ఒక సౌత్ సినిమా అది కూడా కన్నడ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్ ద్వారా 40 కోట్ల వసూళ్ల ను రాబట్టడం తో వారు జుట్టు పీక్కుంటున్నారు.

Advertisement

ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 40 కోట్ల వసూళ్ల ను ఉత్తర భారతంలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టిన దాఖలాలు లేవు అలాంటిది బాహుబలి రికార్డు లను సైతం కేజిఎఫ్ 2 బ్రేక్ చేసింది.కనుక ప్రశాంత్‌ నీల్‌ కూడా టాప్ దర్శకుల జాబితాలో చేరడం ఖాయమైంది.

సౌత్ కు చెందిన ఈ ముగ్గురు దర్శకులు దర్శకులను చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అందులో భాగంగానే హిందీ మీడియాలో కొందరు సౌత్ సినిమాల పై విమర్శలు చేస్తున్నారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ ముగ్గురి త్రయం సౌత్ సినిమా స్థాయిని బాలీవుడ్ లో నిలబెట్టాయి అనడంలో సందేహం లేదు.