సాయి ధరమ్ తేజ్ మిస్ చేసుకున్న మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే... !

మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనకంటు ఒక నటుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.

( Sai Dharam Tej ) మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది నటుల కన్నా కూడా సాయి ధరమ్ చాలా గొప్ప నటుడు అని చెప్పుకోవచ్చు.

ఆయన కెరియర్లో ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని పరాజయాలు కూడా ఉన్నాయి.అయినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా మంచి సినిమాలు తీయాలని తాపత్రయంతో సినిమాలు చేస్తున్నాడు.

కొన్ని సందర్భాల్లో సాయి ధరమ్ తేజ్ సైతం మంచి సినిమాలను చేస్తున్నాడు.మరి సాయి మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటి ? ఏ కారణం వల్ల వదిలేసుకోవాల్సిన వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శతమానం భవతి

దిల్ రాజు నిర్మాణంలో తెలకెక్కిన శతమానం భవతి సినిమాలో( Shatamanam Bhavati ) శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.అయితే ఈ సినిమా కథ ను నిర్మాత తొలుత సాయిధరమ్ తేజ్ తోనే చేయాలని అనుకొని దిల్ రాజు వినిపించారు.

Advertisement

సంక్రాంతికి విడుదల చేస్తాము అని చెప్పగానే అదే సంక్రాంతికి చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 చిత్రం కూడా వస్తుంది కాబట్టి ఆ సినిమాకి పోటీగా వెళ్లే ఉద్దేశం లేకపోవడంతో శతమానం భవతి సినిమా నుంచి సాయి ధరమ్ తేజ్ తప్పుకున్నాడు.

కేరింత

ఒక సాఫ్ట్ హీరో క్యారెక్టర్ లో కేరింత సినిమా( Kerintha Movie ) ఉంటుంది.అయితే ఈ సినిమా కథను తోలుత సాయిధరమ్ తేజ్ కి వినిపించగా అంత సున్నితమైన పాత్రలో తాను నటించలేను అని చెప్పి సున్నితంగా తిరస్కరించాడట.అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

RX100

కార్తికేయ హీరోగా పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా వచ్చిన ఆర్ఎక్స్ 100 చిత్రం( RX100 Movie ) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ సినిమా కథ మొదట సాయి ధరమ్ తేజ్ కె వచ్చిందట.కానీ అలాంటి ఒక రఫ్ పాత్ర తాను చేయలేనని చెప్పి ఈ సినిమాను సైతం వదులుకున్నాడట సాయి.

ఆ ఒక్క కారణంతోనే కల్కి సినిమాలో నటించా.. మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్!
Advertisement

తాజా వార్తలు