ఏపీ సీఎంపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జ్ పాతూరి ఫైర్

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రైతులను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వ్యవసాయం, ఇరిగేషన్ మంత్రులు సమీక్షలు కూడా చేయడం లేదని నాగభూషణం మండిపడ్డారు.రిజర్వాయర్లోకి నీళ్లు వచ్చినా కోస్తా జిల్లాల్లో రైతాంగానికి నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు.

తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి ఏపీ ప్రభుత్వం పట్టించుకోదని విమర్శించారు.శ్రీశైలం నుంచి తెలంగాణ అక్రమంగా నీళ్లు తోడేస్తున్నా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపణలు చేశారు.

సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెడుతున్నారన్నారు.సాగు, తాగు నీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

Advertisement
అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

తాజా వార్తలు