ఈసారి రూట్ మ్యాప్ ఖాయమేనా?

ఆంధ్రప్రదేశ్ వరకు జనసేన( Jana sena ) భాజాపాలు అధికారికంగా మిత్రపక్షాలైనప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో కాదుకదా కనీస స్థాయిలో కూడా ఉమ్మడి కార్యాచరణ కానీ ఒక కార్యక్రమాన్ని కలిసి నిర్వహించిన చరిత్రగాని ఆ రెండు పార్టీలకు లేదు.

అయితే మీడియా సమావేశాలలో మాత్రం మిత్రపక్షాలమని ఇరు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు .

దానికి ప్రదాన కారణం వైసిపి పై తాము చేసే పోరాటంలో రాష్ట్ర స్థాయి బిజెపి నేతలు కలిసి రావడం లేదన్నది పవన్ తరుపున ఆరోపణ అయితే కేంద్రంలో ఉన్న రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా పవన్ వ్యవహరించట్లేదన్నది బిజెపి వైపు నుంచి వస్తున్న ఆరోపణ.

Bjp Ready To Give Route Map To Pavan This Time , ,bjp, Tdp, 2024 Elections, Pa

అయితే ఏది ఏమైనప్పటికీ ఇంతకాలం కనిపించని దూరం మెయింటైన్ చేసిన ఈ రెండు పార్టీలు ఇకపై కలిసి నడవబోతున్నాయని ఎన్ డి ఏ కూటమి పార్టీల మీటింగ్ కు పవన్ ను ఆహ్వానించిన బిజెపి అధిష్టానం భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ పై స్పష్టమైన రూట్ మ్యాప్ ఇవ్వబోతుందని, ఈ రెండు పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను( Pawan kalyan ) ప్రకటించడానికి భాజాపా అధిష్టానం సుముఖంగా ఉన్నదని, జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ స్పేస్ ను సంపాదించుకుంటే తమకు కూడా ఎదిగే అవకాశం కలిసి వస్తుందని, తమకు అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాలకు జనసేన సానుభూతి ఓట్లు కూడా తోడైతే కచ్చితంగా ప్రభావం చూపించగలమని భావిస్తున్న భాజాపా అధిష్టానం పవన్ కోరుకుంటున్న రూట్ మ్యాప్ ఇవ్వడానికి ఆయనతో కలిసి ముందుకు నడవడానికి పూర్తిస్థాయిలో సిద్ధపడిందని దీనిపై చర్చించడానికే ఆయనను హస్తినకు పిలిపించారనే వార్తలు జోరుగా మీడియా లో ప్రసారమవుతున్నాయి .

Bjp Ready To Give Route Map To Pavan This Time , ,bjp, Tdp, 2024 Elections, Pa

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశంతో కలిసి నడవడం తప్పని పరిస్థితి అయినప్పటికీ భవిష్యత్తు లో మాత్రం ఒక బలమైన ఆల్టర్నేటివ్గా రాష్ట్ర రాజకేయలలో ఎదగాల్సిన అవసరాన్ని పవన్కు వివరించబోతున్న భాజపా( BJP ) ఇకపై సొంతంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలించాలని పూర్తిస్థాయి ఫ్రీ హ్యాండ్ ఇస్తామని పవన్ ను ఒప్పించబోతున్నట్లుగా తెలుస్తుంది .మరి దీనికి జనసేన అధినేత ఎలా రియాక్ట్ అవుతారన్నదే ప్రశ్న.

Advertisement
BJP Ready To Give Route Map To Pavan This Time ? , ,BJP, TDP, 2024 ELECTIONS, Pa
నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

తాజా వార్తలు