మూడు ముక్కలాట సీఎం జగన్ పై బీజేపీ నాయకుడు విమర్శలు..!!

మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది.

ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు రాజీనామాలు చేయడానికి రెడీ అవ్వుతున్నారు.

మరోపక్క అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు చెప్పుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు.ఈ మేరకు సీఎం జగన్ కి లేఖ రాసిన ఆయన."3 ముక్కలాట తప్ప మూడేళ్లలో చేసింది ఏమీ లేదు.అమరావతి రైతులతో మాట్లాడాలని ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు.

ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులు దోపిడీయే వైసీపీ లక్ష్యం.మూడున్నర ఏళ్లలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని కూడా డిమాండ్ చేశారు.

దీంతో సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలు చర్చనీయాంసంగా మారాయి.

Advertisement
పవన్ కు కేంద్ర మంత్రి పదవి ?  నాగబాబుకు అందుకేనా ఛాన్స్ ? 

తాజా వార్తలు