పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..!

గోషామ‌హల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

రేపు జ‌ర‌గ‌నున్న‌ మునావ‌ర్ ఫారుఖీ షోను అడ్డుకుంటామ‌ని హెచ్చరించిన నేప‌థ్యంలో ముంద‌స్తుగా అదుపులోకి తీసుకుని లాలాగూడ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

మునావ‌ర్ త‌న కామెడీ షోలో హిందూ దేవ‌త‌ల‌ను అవ‌మానిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.దీంతో ఆయ‌న షోను బీజేపీ వ్య‌తిరేకిస్తోంది.

ఆ షోకు అనుమ‌తి ఇవ్వొద్దంటూ డీజీపీని కూడా క‌లిశారు.అయిన‌ప్ప‌టికీ ఈ షో నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తులు ల‌భించాయి.

మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేర‌కు మునావ‌ర్ హైద‌రాబాద్ కు రానున్నారు.ఈ క్ర‌మంలో రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు హైద‌రాబాద్ వేదిక‌గా ఆయ‌న స్టాండ‌ప్ కామెడీ షో జ‌ర‌గ‌నుంది.

Advertisement

ఇందుకు సంబంధించిన టికెట్ల‌ను బుక్ మై షో సంస్థ అమ్మింది.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement