లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న ఎమ్మెల్యే దంప‌తులు

ఉత్త‌రాఖండ్‌లో రెండేళ్లుగా ఓ ఎమ్మెల్యే దంప‌తుల‌పై ఓ యువ‌తి పోరాటం చేస్తోంది.

స‌ద‌రు ఎమ్మెల్యే త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని అత‌డితో పాటు ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన స‌ద‌రు ఎమ్మెల్యే భార్య‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాలని ఆమె పోరాటం చేస్తోంది.

రెండేళ్లుగా ఆమె ఈ విష‌యంలో కాళ్ల‌కు ఉన్న చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి చివ‌ర‌కు స‌క్సెస్ అయ్యింది.ఆమె పోరాటం ఫ‌లించ‌డంతో స‌ద‌రు బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న భార్య‌పై సైతం లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది.

BJP MLA Couple Harrasment Case,Mahesh Negi, MLA,couple,Uttarakhand Girl, Court,

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో జ‌రిగింది.బీజేపీ ఎమ్మెల్యే మ‌హేశ్‌నేగితో త‌న‌కు రెండేళ్లుగా శారీర‌క సంబంధం ఉంద‌ని.

ఆ బాధితురాలి ప్ర‌ధాన ఆరోప‌ణ‌.ఈ క్ర‌మంలోనే త‌న కుమార్తె డీఎన్ఏ సైతం త‌న భ‌ర్త డీఎన్ఏతో స‌రిపోవ‌డం లేద‌ని.

Advertisement

త‌న కుమార్తె డీఎన్ఏను ఎమ్మెల్యే డీఎన్ఏను టెస్ట్ చేయాల‌ని అది మ్యాచ్ అవుతుంద‌ని కూడా ఆమె ఆరోపిస్తున్నారు.అలాగే ఎమ్మెల్యేకు త‌న‌కు సంబంధాలు ఉన్నాయ‌ని రూడీ చేసేందుకు ఆధారంగా ఓ వీడియోను కూడా ఆమె విడుద‌ల చేశారు.

ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఉత్త‌రాఖండ్ రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగింది.బీజేపీ వెంట‌నే ఎమ్మెల్యే నేగిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌న్న డిమాండ్లు కేవ‌లం రాజ‌కీయ ప‌క్షాల నుంచే కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి కూడా వ‌స్తున్నాయి.

ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఎమ్మెల్యే భార్య సైతం త‌న భ‌ర్త పేరు బ‌య‌ట పెట్ట‌వ‌ద్ద‌ని త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించింద‌ని కూడా బాధితురాలు కోర్టుకు విన్న‌వించింది.ఈ క్ర‌మంలోనే డెహ్ర‌డూన్ న్యాయ‌స్థానం ఎమ్మెల్యే నేగితో పాటు ఆయ‌న భార్య‌పై వెంట‌నే లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

ఇంద్రకీలాద్రి పై రెండవ రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ..
Advertisement

తాజా వార్తలు