బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి.. కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపహాస్యం చేశారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

మీరాకుమార్ ధైర్యం చేయకుంటే రాష్ట్రం వచ్చేది కాదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.ఇప్పుడున్న పాలకులు తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రం వచ్చేది కాదని చెప్పారు.

తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కేసీఆర్ పార్లమెంట్ లో లేరని తెలిపారు.రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్ కు వ్యతిరేకంగా కేసీఆర్ ఓటు వేశారని పేర్కొన్నారు.

ఈ సారి కాంగ్రెస్ వేవ్ నడుస్తుందని ఆయన వెల్లడించారు.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు