బీజేపీ నేతలకు విలువలు లేవు..: జగ్గారెడ్డి

బీజేపీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) మండిపడ్డారు.బీజేపీ నేతలు( BJP Leaders ) అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని మోదీ( PM Modi ) తుంగలో తొక్కారని ఆరోపించారు.పీవీ నరసింహారావును( PV Narasimha Rao ) ప్రధానిని చేసింది తమ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అని జగ్గారెడ్డి తెలిపారు.

పీవీకి భారతరత్న అవార్డు ఇచ్చి బీజేపీ గొప్పులు చెప్పుకుంటోందన్నారు.ఈ క్రమంలోనే బీజేపీ నేతలకు విలువలు లేవన్న ఆయన చిల్లర రాజకీయాలు చేస్తారంటూ విమర్శించారు.

ఇక కిషన్ రెడ్డి( Kishan Reddy ) స్క్రిప్ట్ లీడర్ అని ఎద్దేవా చేశారు.మరోవైపు దమ్ములేని ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ బరిలో దింపిందన్నారు.

Advertisement

అధికారం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు