కేసీఆర్ కు బీజేపీ నేత ఈటల ఛాలెంజ్..!!

ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జనగర్జన సభ కొనసాగుతోంది.

ఈ సభలో పాల్గొన్న బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరారు.

ఏ జిల్లాలోనైనా 24 గంటల కరెంట్ వస్తే పదవికి రాజీనామా చేస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు.

ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీని రద్దు చేయడం కాదన్న ఆయన కేసీఆర్ రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు.తెలంగాణ ఏర్పాటు ఫలితాన్ని కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుందని ఆరోపించారు.

పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు