భద్రత తొలగింపుపై బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆగ్రహం

భద్రత తొలగింపుపై బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భధ్రత తొలగింపునకు ఎమ్మెల్యే నన్నపనేని నరేందరే కారణమని ప్రదీప్ రావు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తనకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యే నరేందర్, ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.బీజేపీ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది.

ముందుగా ప్రదీప్ రావుకు 2+2 భద్రత కల్పించిన సర్కార్.ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో గన్ మెన్లను తొలగించింది.

ఈ క్రమంలోనే ఏడేళ్లుగా నలుగురు గన్ మెన్లు ప్రదీప్ రావుకు సెక్యూరిటీ కల్పిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆ నలుగురు గన్ మెన్లను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
చేతివాటం చూపించిన జొమాటో డెలివరీ బాయ్.. వీడియో వైరల్..

తాజా వార్తలు