బీజేపీకి డిపాజిట్లు గల్లంతవడం ఖాయం..: మంత్రి కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

తమ మూడు ప్రధాన హామీల సంగతేంటన్న కేటీఆర్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడని ప్రశ్నించారు.

అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేది ఎప్పుడని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.తమ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడో చెప్పాలన్నారు.

ఈ మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని చెప్పారు.మళ్లీ వంద స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అని తెలిపారు.

మోదీ పదేళ్ల పాలనలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు 140 కోట్ల భారతీయులను మోసం చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడమనేది జరగదని స్పష్టం చేశారు.

Advertisement
అంగారకుడిని ఎరుపు రంగు గ్రహంని ఎందుకు పిలుస్తారో తెలుసా?