బీజేపీకి రైతులంటేనే కోపం.. మంత్రి హరీశ్ రావు కామెంట్స్

బీజేపీపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బీజేపీకి రైతులు అంటేనే కోపం.

ఎందుకో మరి అని ప్రశ్నించారు.నల్ల చట్టాలను రద్దు చేయమని అడిగినందుకే రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష పెంచుకున్నట్లు ఉందని తెలిపారు.

కిసాన్ అనే పేరు కనిపిస్తే చాలు మోదీ ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టేస్తోందని ఆరోపించారు.బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మూటలు.

రైతులకు కోతలు పెడుతోందని చెప్పారు.కేంద్రం రాయితీలు ఎత్తేస్తోందని వెల్లడించారు.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!