బీజేపీకి జగన్ డిమాండ్లు ఇవే ?  రాజు గారి పై వేటేనా ?

కేంద్రం అధికార పార్టీ బీజేపీ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.తమతో పొత్తు పెట్టుకున్న ఒక్కో పార్టీ దూరమవుతున్న తీరు కాస్త ఆందోళన కలిగిస్తోంది.

అందుకే ముందు ముందు ఎటువంటి ఇబ్బంది రాకుండా, తమకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీలతో సఖ్యత గా ఉండేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగానే వైసీపీకి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు సిద్ధమవుతోంది.

Bjp Is Likely To Disqualify Ragurama Krishnamraju In Support Of Jagan Bjp ,ysrc

ఈ నేపథ్యంలో బిజెపి జగన్ కు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.పదే పదే ఎన్డీయేలో చేరాలంటూ పిలుపు ఇస్తోంది.

కేంద్రం ముందు జగన్ కొన్ని డిమాండ్లు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా పదే పదే తమ విషయం ఆరోపణలు చేస్తూ, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్న రఘురామకృష్ణంరాజుపై ఎప్పటి నుంచో వైసీపీ ఆగ్రహంగా ఉంది.

Advertisement

ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేసింది. వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం బిజెపి వైసిపి ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో, రఘురామకృష్ణంరాజు వేటు వేయించేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.దీంతోపాటు మరి కొన్ని డిమాండ్లను కేంద్రం ముందు పెట్టేందుకు వైసిపి సిద్ధమవుతోంది.

శాసన మండలి రద్దు మూడు రాజధానుల విషయం లో తమ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని లోకేష్ చంద్రబాబు పై సీబీఐ విచారణ చేయించాలనే కీలకమైన డిమాండ్ వినిపించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.వీటితో పాటు సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల వ్యవహారాల్లోనూ, తమకు అన్ని విధాలుగా సహకరించాలని వైసిపి సిద్ధమవుతోంది.

వీటన్నిటికంటే ముందుగా తమకు ఏకు మేకులా తయారైన రఘురామకృష్ణంరాజు అడ్డు తొలగించుకోవాలని పట్టుదలతో వైసీపీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.మొన్నటి వరకు వైసిపి డిమాండ్ల విషయంలో పట్టించుకోనట్టుగా వ్యవహరించిన బిజెపి ఇప్పుడు మాత్రం జగన్ కోరిని కోరికలను తీర్చే అవకాశం ఉండడంతో, రాజు గారి పై అనర్హత వేటు వేయించి, ఆ తర్వాత మిగతా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని జగన్ భావిస్తున్నారట.

ఇప్పటికే రఘురామకృష్ణంరాజుకి కేంద్రం కల్పించిన భద్రత తొలగించాలంటూ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.జగన్ సైతం కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసిన సందర్భంగా రాజుగారి అంశమై ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.

Advertisement

ఇప్పుడు ఎన్డీయే నుంచి ఒక్కో పార్టీ దూరమవుతున్న నేపథ్యంలో, జగన్ ను దగ్గర చేసుకునేందుకు, ఆయన మద్దతు పొందేందుకు బిజెపి రఘురామకృష్ణరాజు పై మరికొద్ది రోజుల్లోనే వేటు వేసే అవకాశం ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాల టాక్.

తాజా వార్తలు