పవన్ పై బీజేపీ హోప్స్ .. గెలిస్తేనే ఆ ఛాన్స్ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.బిజెపితో జనసేన పొత్తు( Jana Sena BJP ) కుదుర్చుకున్న నేపథ్యంలో,  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతామనే ధీమాతో ఉన్నారు.

ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా ముగిసింది.32 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని భావించినా ఎనిమిది సీట్లను బిజెపి జనసేనకు కేటాయించింది.  అయితే జనసేన మొత్తం 11 సీట్లను బిజెపి నుంచి డిమాండ్ చేయగా ,మిగిలిన స్థానాలను కేటాయిస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు.

అయితే ఇచ్చిన స్థానాల్లో మాత్రం గెలిచి సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి జనసేనకు ఉంది.లేకపోతే బీజేపీ తోపాటు , తెలంగాణ ప్రజల్లోను జనసేన అభాసు పాలయ్యే అవకాశం ఉంది.

బిజెపి జనసేనకు కేటాయించిన సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి నియోజకవర్గం ఒకటి మాత్రమే ఉంది.ఆ స్థానాన్ని బిజెపి నుంచి ఇటీవల జనసేన లో చేరిన నేతకు కేటాయించారు.

కూకట్ పల్లి లో గెలుపును జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .దీంతో పాటు,  ఖమ్మంలోనూ పోటీ చేస్తూ ఉండడం తో అక్కడ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది .

Advertisement

బిజెపి , జనసేన పొత్తు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని బిజెపి ఆశలు పెట్టుకుంది. పవన్ ( Pawan Kalyan )ప్రభావం తో కచ్చితంగా బిజెపి పై జనాల్లో ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ అగ్ర నేతలు ఆశలు పెట్టుకున్నారు.8 స్థానాల్లో కనీసం రెండు స్థానాల్లో అయినా జనసేన అభ్యర్థులు గెలిస్తే ఆ పార్టీకి గౌరవం లభిస్తుంది.అలాగే తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే జనసేనకు సముచిత స్థానాన్ని కల్పిస్తారు .అలా కాకుండా జనసేన అభ్యర్థులు ఓటమి చెంది బిజెపి కూడా ఓడితే ఆ ఓటమికి కారణం జనసేన అనే నిందలు బిజెపి వేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.

 తెలంగాణలో టిడిపి ఎన్నికలకు దూరంగా ఉండడం, ఏపీలో టీడీపీ జనసేన పొత్తు కుదిరిన పరిస్థితుల్లో తెలంగాణ టిడిపి ఓటు బ్యాంకు జనసేన బిజెపికి  డైవర్ట్ అవుతాయని బిజెపి ( BJP )అంచనా వేస్తోంది.పవన్ చరిష్మా పైనే ఎక్కువ నమ్మకం బిజెపి పెట్టుకున్న నేపథ్యంలో, ఈ రెండు పార్టీలకు ఫలితాలు ఆశాజనకంగా వస్తే సరే , లేదంటే రెండు పార్టీల మధ్య వైరం ఏర్పడే అవకాశం లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు