జనసేనలో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే !

బీజేపీ సీనియర్ నాయకుడు.మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరిపోయారు.

జనసేనలో చేరే ఉద్దేశంతోనే ఆయన తన శాసనసభ్యత్వానికి .బీజేపీకి నిన్ననే రాజీనామా చేశారు.రాజీనామా లేఖలను శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలకు ఈ-మెయిల్‌ ద్వారా పంపించారు.

ఈ నేపథ్యంలో ఈరోజు ఆకుల సత్యనారాయణ దంపతులు పవన్ సమక్షం లో పార్టీలో చేరిపోయారు.వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్.సత్యనారాయణతోపాటు ఆయన వర్గీయులు, అనుచరులు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి.

జనసేన పార్టీలో చేరిపోయారు.

Advertisement
Advertisement