కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా..: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

ఈసీ డమ్మీగా మారిందని ఆరోపించారు.ఎన్నికల సంఘాన్ని బీజేపీ( BJP ) ఇంటి సంస్థగా మార్చుకుందంటూ జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా అని చెప్పారు.అన్ని కులాలు బీజేపీకి దూరం అవుతున్నాయనే అమిత్ షా( Amit Shah ) గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులను పంపారని విమర్శించారు.

అయితే అమిత్ షా పేరిట డీప్ ఫేక్ వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నిన్న గాంధీభవన్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు పలువురు నేతలకు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు