బీఆర్ఎస్ కు పరోక్ష మిత్రపక్షంగా బీజేపీ..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన కేటీఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటపడాలని హితవు పలికారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ నాయకులు కానీ అంగీకరించే పరిస్థితిలో లేరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.పరనిందలను ఆపకపోతే కేటీఆర్ ప్రతిపక్ష హోదాలో కూడా ఉండరని చెప్పారు.

బీఆర్ఎస్ కు పరోక్ష మిత్రపక్షంగా బీజేపీ ఉందని పేర్కొన్నారు.లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు.

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేయలేదని ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పెద్ద బోగస్ అన్న జీవన్ రెడ్డి కమీషన్ల కోసమే అలా చేసిందని ఆరోపించారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు