మొండి మొటిమ‌ల‌ను‌ కాక‌ర‌కాయ‌తో త‌రిమికొట్టండిలా!

యుక్త వ‌య‌సు రాగానే ప్రారంభం అయ్యే మొటిమ‌లు ఎంత ఇబ్బంది పెడ‌తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

కేవ‌లం అమ్మాయిల‌నే కాదు అబ్బాయిలు కూడా మొటిమ‌ల స‌మ‌స్య‌తో తీవ్రంగా చింతిస్తుంటారు.

ఈ క్ర‌మంలోనే మొటిమ‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఏవేవో క్రీములు రాస్తూ తంటాలు ప‌డ‌తాయి.ఒక్కో సారి ఎన్ని చేసినా మొటిమ‌లు పోనే పోవు.

అయితే ఇలాంటి మొండి మొటిమ‌ల‌ను పోగొట్ట‌డంతో కాక‌ర‌కాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కాక‌ర‌కాయ‌లో ఉండే పోష‌క విలువ‌లు కేవ‌లం ఆరోగ్యానేకే కాదు సౌంద‌ర్య ప‌రంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా మొండి మొటిమ‌ల‌తో బాధ ప‌డే వారు.కాక‌ర‌కాయ తీసుకుని పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

Advertisement

ఆ ర‌సంలో చిటికెడు ప‌సుపు మ‌రియు క‌ల‌బంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేయాలి ఇర‌వై నిమిషాల అనంత‌రం కోల్డ్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే మొండి మెటిమ‌లు దూరం అవుతాయి.

మ‌రియు ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.

అలాగే కాక‌ర‌కాయ మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.ఈ కాక‌ర‌కాయ‌ ర‌సంలో తేనె వేసి క‌లుపుకుని ముఖానికి పూత‌లా వేసుకోవాలి.ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నిచ్చి ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొండి మెటిమ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.‌

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇక కాక‌ర‌కాయ తీసుకుని పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో నిమ్మ ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప‌ట్టించి అర గంట పాటు వ‌దిలేయాలి.

Advertisement

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల కూడా మొండి మొటిమ‌ల స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.మ‌రియు న‌ల్ల మ‌చ్చ‌లు కూడా పోతాయి.

తాజా వార్తలు