టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. తమ గ్రామానికి రావద్దన్న గ్రామస్దులు.. ??

తెలంగాణ ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

దీనికి తగ్గట్టుగానే టీఆర్‌ఎస్ నేతలకు అప్పుడప్పుడు ప్రజల నుండి నిరసన సెగలు ఎదురవుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.ఆ వివరాలు చూస్తే.

Bitter Experience For Trs Mla Jeevan Reddy, Telangana, TRS MLA, Jeevan Reddy, Bi

నిజమాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం పెద్దమ్మతల్లి విగ్రహం అపహరణకు గురైంది.ఈ నేపధ్యంలో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గ్రామంలోని ఆలయాన్ని పరిశీలించడానికి వెళ్లగా, ఢీకంపల్లి గ్రామస్తులు జీవన్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు.

సత్వరమే గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ, నిందితులను అరెస్ట్ చేసేంత వరకు ఎమ్మెల్యే తమ గ్రామానికి రావద్దని అడ్డుకున్నారు.కాగా వీలైనంత తొందరగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ఎంతా చెప్పినా గ్రామస్తులు వినిపించుకోలేదు.

Advertisement

చేసేది ఏం లేక జీవన్‌రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు.ఇకపోతే చోరీకి గురైన విగ్రహం బాసరలో దొరికిందని సమాచారం.

నువ్వులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..
Advertisement

తాజా వార్తలు