బిగ్‌బాస్ విన్నర్ అక్కడైనా కమర్షియల్ సక్సెస్ ని దక్కించుకుంటుందా?

తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా నిలిచిన బిందు మాధవి( Bindu Madhavi ) సెకండ్‌ ఇన్నింగ్స్ లో కుమ్మేయడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా వ్యక్తం చేశారు.

కానీ ఇప్పటి వరకు ఈమె బిగ్ బాస్ విన్నర్ ( Bigg Boss Winner ) గా దక్కించుకున్న ఆఫర్లు పెద్దగా ఏమీ లేవు.

ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్న సినిమాలను ఈమె చేస్తూ వస్తోంది.ఈమె కెరీర్‌ విషయంలో తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు.

సినిమాల్లో చిన్నా చితకా ఆఫర్లు మాత్రమే రావడం కారణంగా ఈమెను జనాలు లైట్ తీసుకుంటున్నారా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది.తాజాగా న్యూసెన్స్‌( Newsense Webseries ) అనే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.నవదీప్‌ ( Navdeep ) తో కలిసి ఆ సిరీస్‌ లో నటించింది.

అతడితో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా బిందు మాధవి నటించినట్లుగా ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతుంది.హీరోయిన్‌ గా బిందు మాధవి వెండి తెరపై సక్సెస్‌ లను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది.

Advertisement

కనుక కనీసం న్యూసెన్స్ తో అయినా ఈ బిగ్‌ బాస్‌ విన్నర్‌ బిందు మాధవికి సక్సెస్ దక్కేనా అనేది చూడాలి.

ఓటీటీ( OTT ) ద్వారా స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న న్యూసెన్స్ గురించి ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.బిగ్‌ బాస్‌ విన్నర్‌ గా నిలిచిన వారు గతంలో పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.అందుకే ఈసారి కూడా ఈమె విన్నర్ గా నిలిచింది కానీ హీరోయిన్‌ గా మెప్పించలేక పోతుంది.

అందుకే బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి కెరీర్‌ గురించి ఆందోళన వ్యక్తం అవుతుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.ముందు ముందు అయినా సిరీస్ ల్లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆకట్టుకునే కథలు రెండు మూడు తగిలితే సీనియర్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ మరియు లేడీ ఓరియంటెడ్‌ సినిమా( Lady Oriented Movies ) లకు మోస్ట్‌ వాంటెడ్‌ అవ్వచ్చు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement