బిగ్‌బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కంటెస్టెంట్స్ వీళ్లే..??

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్( Bigg Boss ) ప్రతి సీజన్ కు విశేషమైన స్పందన వస్తోంది.

ఈ టీవీ షో ఎప్పటికప్పుడు టీఆర్పీ రేటింగ్స్‌ను బద్దలు కొడుతోంది.

తెలుగులో మొదటి సీజన్ స్టార్ట్ చేయడానికి ముందు ఎన్నో సందేహాలు ఉన్నాయి కానీ ఈ రియాల్టీ షోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.అందుకే ఇప్పటికే 7 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

త్వరలో 8వ సీజన్ కూడా ప్రారంభం కానుంది.బుల్లితెర ప్రేక్షకులు ఆల్రెడీ బిగ్ బాస్ 8వ సీజన్ ( Bigg Boss Season 8 )కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారు.

ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పాలంటూ స్టార్ మా టీవీని ప్రశ్నిస్తున్నారు.తెలుగు సీజన్ 8 మరో 50 రోజుల్లోనే స్టార్ట్ అవుతుందనే ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అంటే సెప్టెంబర్ మొదటి లేక రెండో వారంలో 8th సీజన్ ప్రారంభం కావచ్చు.ఒక రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 1 ఆదివారం ( Sunday, September 1 )బిగ్‌బాస్ సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ జరగనుంది.

దీనర్థం బిగ్ బాస్ అభిమానులు ఈ షో చూడడానికి 50 రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.

ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచే చాలా రూమర్స్ వస్తున్నాయి.ముఖ్యంగా కంటెస్టెంట్స్ కి సంబంధించిన పుకార్లు జోరుగా సాగుతున్నాయి.కొందరిని ఫైనల్ చేసారని లేటెస్ట్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.

వాటి ప్రకారం యాంకర్ రీతూ చౌదరి, వేణుస్వామి, నయని పావని, జబర్దస్త్ అప్పారావు, కుమారి ఆంటీ( Anchor Ritu Chaudhary, Venuswamy, Nayani Pavani, Jabardast Apparao, Kumari Aunty ), ఓ సెలబ్రిటీ కపుల్ ఈసారి సందడి చేయనున్నారట.కుమారి ఆంటీ వేణు స్వామి ఇద్దరు కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారే.

జేఎన్టీయూహెచ్ కిచెన్‌లో పిల్లి ప్రత్యక్షం.. ఎలుక కోసమే వచ్చిందంటూ నేతలు జోకులు..!
న్యాచురల్ స్టార్ నానికి జోడీగా ఎన్టీఆర్, చరణ్ బ్యూటీ.. ఈ హీరోయిన్ దశ తిరిగిపోతుందిగా!

ఇద్దరూ వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.వారు తమ వృత్తిని వదులుకొని బిగ్ బాస్ హౌస్ లో సమయం గడపడానికి వస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Advertisement

ఇవన్నీ ఎంతవరకు నిజమనేది 50 రోజుల తర్వాతే తెలుస్తుంది.అఫీషియల్ గా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ను బయట పెట్టలేదు.బహుశా ఇప్పటికీ అందరూ ఫైనలైజ్ కాకపోయి ఉండవచ్చు.

రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఆలోగా ఇప్పుడు అనుకుంటున్న కంటెస్టెంట్ల పేర్లు కూడా మారిపోవచ్చు.ఇక హోస్టుల విషయానికి వస్తే మొదటగా ఎన్టీఆర్, నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఆ తర్వాత నాగార్జున బిగ్‌బాస్ కి హోస్ట్ గా చేస్తున్నారు.కొద్దిరోజులు సమంత కూడా హోస్టింగ్ చేసింది.

గత అయిదు సీజన్ల నుంచి నాగార్జునే ఈ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు.ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్ గా కంటిన్యూ అవుతాడని సమాచారం.

మరి ఈ సారి బిగ్‌బాస్ హౌస్ లో ఎవరు అడుగు పెడతారు, ఎలాంటి టాస్కులు ఇస్తారో చూడాలి, పోయిన సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు.తర్వాత అరెస్టు అయ్యాడు.

అది వేరే సంగతి కానీ ఈసారి ఎవరు టైటిల్ నెగ్గుతారో చూడాలి.

తాజా వార్తలు