నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం చేసిన పల్లవి ప్రశాంత్.. ఏం చేశారంటే?

తెలుగు బిగ్ బాస్ 7 సీజన్ ( Bigg Boss 7 Season )విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే.

బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రశాంత్ కి.

కాగా తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు హౌస్ లో ఉన్నంతవరకు ఎన్నెన్నో మాటలు చెప్పిన పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) బయటికి రాగానే వాటిని గాలికి వదిలేసాడు.

అంతేకాకుండా ఓవర్ యాక్షన్ కాండిడేట్ అంటూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే చాలా సందర్భాలలో కొంతమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్న పల్లవి ప్రశాంత్ తాజాగా కూడా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

Advertisement

అసలు ఏం జరిగిందంటే.నిరుపేద కుటుంబానికి సహాయం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు పల్లవి ప్రశాంత్.ఇటీవలే పరమేశ్వర్( Parameshwar ) అనే రైతు ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని ఆర్ధిక సహాయం చేసి వారికి బాసటగా నిలిచారు పల్లవి ప్రశాంత్.

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు రైతు దాదువాయి పరమేశ్వర్.

ఇతని భార్య శంకరమ్మ, ముగ్గురు కుమార్తెలు పడుతున్న కష్టాలను తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ గురువారం చిన్న శంకరంపేట‌లోని వారి నివాసానికి వెళ్లి రూ.20 వేలు అందజేశారు.కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జూన్ 5వ తేదీన పరమేశ్వర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పరమేశ్వర్ కి 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.వీళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ తనకు తోచిన సహాయం చేసిన పల్లవి ప్రశాంత్‌కు పరమేశ్వర్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

బుచ్చిబాబు ఫ్యూచర్ లో గురువును మించిన శిష్యుడు అవుతాడా..?
Advertisement

తాజా వార్తలు