బిగ్ బాస్ షో సీజన్ -2 ఎలా ఉండబోతోందో తెలుసా..

బిగ్ బాస్ షో ఇప్పుడు బుల్లి తెరమీద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న షో.

తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆదరణ పొందుతున్న షో ఇదే,దీనికి కారణం ఎన్టీఆర్ అని చెప్పడం లో సందేహం లేదు.

ఈ షో మొదట్లో విమర్శలు ఎదుర్కొంది,దీనిలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాస్తో కూస్తో క్రేజ్ వున్నవాళ్లు అయితే బావుండేది అని అన్నారు అంతా.చాలా బోరింగ్ గా ఉంది అని బహిరంగ అన్న వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే ఎన్టీఆర్ హోస్టింగ్ తో ఆ విమర్శలను మేనేజ్ చేస్తూ వచ్చింది బిగ్ బాస్ టీం.మొదట్లో ఈ షోకి టీఆర్పీ రేటింగ్ బాగున్నప్పటికీ తర్వాతర్వాత రేటింగ్ డ్రాప్ అవుతూ వచ్చింది.ఈ షో మరొక ఇంకా 20 రోజుల్లో ముగియనుంది.

రెండో సీజ‌న్‌కు కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా పెట్టుకోవాల‌ని స్టార్ మా డిసైడ్ అయ్యింద‌ట‌.ఈ సారి బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో మొదటి షో కి జరిగిన పొరపాట్లు రిపీట్ అవ్వకూడదు అని కంటెస్టెంట్స్ విషయంలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి,పేరున్న సెలబ్రిటీస్ ని మాత్రమే తీసుకోమని ఎన్టీఆర్ టీం నిర్వాహకులకి చెప్పారట.

Advertisement

మొదటి షో మీద ఎన్ని విమర్శలు వచ్చిన అది ఎన్టీఆర్ ఫేమ్ తో తగ్గిపోయాయి అని ఈ సారి పాపులర్ కంటెస్టెంట్స్ ఉండాలని ఎన్టీఆర్ టీం చెప్తోంది కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే ఈ షో సూపర్ హిట్ గా నడుస్తోంది అని అది కూడా ఎన్టీఆర్ ఉండటం వల్లనే అని అంటున్నారు.మిగతా రోజుల్లో జనం బొర్ ఫీల్ అవుతున్నారు అని అదే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటే మరింత క్రేజ్ వస్తుంది అని ఎన్టీఆర్ టీమ్ చెప్పింది.

మరి షో నిర్వాహకులు ఎన్టీఆర్ టీమ్ చెప్పిన వాటిని ఫాలో అవుతారా.వింటే ఎలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకువస్తారు అనేది బిగ్ బాస్ షో సీజన్ -2 కోసం వేచి చూడాల్సిందే మరి .

Advertisement