ఆ విషయాలు చెబితే కాపురాలు కూలిపోతాయి... బిగ్ బాస్ హిమజ సంచలన వ్యాఖ్యలు?

బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హిమజ ( Himaja ) అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా స్టార్ హీరోల సినిమాలలో హిమజ బాగమవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమెకు బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశం కూడా వచ్చింది.ఇలా బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న హిమజ టైటిల్ అందుకోకపోయినా తన ఆటతీరుతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత బుల్లితెర సీరియల్స్ కి దాదాపు దూరంగా ఉంటున్న ఈమె వరసగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హిమజ తన లైఫ్ లో లవ్ బ్రేకప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకు తన జీవితంలో పెద్దగా లవ్ లెటర్స్ ప్రపోజల్స్ రాలేదని, కాంప్లిమెంట్ గా ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయని చెప్పింది.

దీంతో మిమ్మల్ని ఎవరూ లవ్ చేయరా అంటూ ప్రశ్నించారు.ఎందుకు చేయరు చాలామంది నన్ను లవ్ చేశారు.నేను వారిని లవ్ చేశాను.కానీ, ఇప్పుడు ఎవరి లైఫ్ వారిది.

Advertisement

దాన్ని బ్రేకప్ అని చెప్పి లవ్ వ్యాల్యూను తీయలేను.కానీ, ఒకసారి లవ్ చేస్తే లైఫ్ లాంగ్ ఆ ప్రేమ అలాగే ఉండిపోతుంది.

ప్రేమ అనేది సినిమాలోని క్యారెక్టర్ లాంటిది కాదు అంటూ తెలియజేశారు.

ఇక నేను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఒక అబ్బాయి ప్రేమలో పడ్డాను తను కూడా నన్ను ప్రేమించారు.తన లవ్ స్టోరీ గురించి చెబుతూ కొంతమంది గురించి చెప్తే కాపురాలు కూలిపోతాయని టైటిల్ పెట్టి ప్రచారం చేస్తున్నారని , ఆ టైటిల్ కి ఆ వీడియోలో ఉన్న కంటెంట్ కి ఏమాత్రం సంబంధం ఉండదని తెలిపారు.ఆ ఇంటర్వ్యూ చేసింది నా స్నేహితురాలే.

అది వ్యూస్ కోసం అలా టైటిల్ పెట్టిందని ఈ సందర్భంగా హిమజ తెలిపారు.ఎప్పుడు స్కూల్ డేస్ లో ప్రేమ గురించి ఇప్పుడు నేను బయట పెడితే బాగుండదని ఇప్పుడు వారు పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీగా ఉంటారు అలాంటిది నేను వారి పేర్లు చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకనే ఉద్దేశంతో అలా మాట్లాడాను అంటూ హిమజ క్లారిటీ ఇచ్చారు.

సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?
Advertisement

తాజా వార్తలు