Bigg Boss Neha Choudary: పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ సీజన్6 బ్యూటీ.. పెళ్లి కొడుకు ఎవరంటే?

బిగ్ బాస్ షో ఎంతోమందికి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణమైంది.

కొంతమంది సెలబ్రిటీల కెరీర్ కు ఈ షో మైనస్ అయినా ఎంతోమంది సెలబ్రిటీల కెరీర్ కు ఈ షో ప్లస్ అయింది.

ఈ షో వల్ల కొంతమందికి ఆర్థికంగా బెనిఫిట్ కలిగింది.ఈ షోలో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ కు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుతున్న సంగతి తెలిసిందే.

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.స్వయంగా నేహా చౌదరి ఈ విషయాన్ని వెల్లడించడంతో ఆమె పెళ్లికి సంబంధించిన శుభవార్త విని ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

బుల్లితెరపై స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేహా చౌదరి స్పోర్ట్స్ ద్వారా కూడా సత్తా చాటారు.బిగ్ బాస్ షో సీజన్6 లో ఎంట్రీ ఇచ్చే సమయంలో బిగ్ బాస్ షోకు వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పానని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

తన బీటెక్ క్లాస్ మేట్ ను నేహా చౌదరి పెళ్లి చేసుకోనున్నారని సమాచారం అందుతోంది.

యూట్యూబ్ లో నా పెళ్లి గోల మొదలైంది అంటూ నేహా చౌదరి పేర్కొన్నారు.నేహా చౌదరి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు అనిల్ కాగా త్వరలో నేహా చౌదరి పెళ్లి తేదీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది.అనిల్ నేహా చౌదరి జోడీ బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ కాలేదని త్వరలో ఇతర వివరాలను వెల్లడిస్తానని నేహా చౌదరి చెప్పుకొచ్చారు.నేహా చౌదరి బిగ్ బాస్ షో ద్వారా ఆశించిన స్థాయిలో గుర్తింపును సంపాదించుకోకపోయినా కెరీర్ పరంగా మరింత ఎదగాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement