Pallavi Prashanth: రైతు బిడ్డ ప్రశాంత్ కి ఇచ్చి పడేసిన నాగార్జున.. నువ్వసలు రైతుబిడ్డవేనా అంటూ?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) రసవత్తరంగా సాగుతోంది.

మొదటివారం చప్పగా సాగినా రెండవ వారం మాత్రం కొట్లాటలు, అరుపులతో రసవత్తరంగా మారింది.

చూస్తుండగానే అప్పుడే రెండవ వారం ఎలిమినేషన్స్ కూడా దగ్గర పడ్డాయి.ఇక నేడు హౌస్ లో నుంచి ఎవరో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లాను అన్నారు.

ఇక వీకెండ్ కావడంతో నాగార్జున( Nagarjuna ) రావడం కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి క్లాస్ పీకడం జరిగిపోయాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులు అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

ఇక ఆ ప్రోమోలో కంటెస్టెంట్ లందరికీ ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు హోస్ట్ నాగార్జున.ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై( Pallavi Prashanth ) సీరియస్ అవడంతో దెబ్బకు మనోడు బిక్క మొహం వేశాడు.ఈ వారం పెద్దగా ఫెర్ఫార్మెన్స్ చేయలేదని శివాజీకి( Shivaji ) కౌంటర్స్ పడ్డాయి.

Advertisement

ప్రతిసారి వయసు అంశాన్ని మాట్లాడుతున్నందుకు షకీలాకు కూడా స్మూత్‌గా పడ్డాయి.ఇక నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్‌పై అమరదీప్ అరిచాడు.

ఈ విషయమై స్పందించిన నాగార్జున.అతడి డబ్బులు అతడి ఇష్టం.

అతడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు నీకెందుకు? అని అనడంతో దెబ్బకు అమర్దీప్( Amardeep ) మౌనంగా ఉండిపోయాడు.అలాగే హౌసులోకి వెళ్లేటప్పుడు పల్లవి ప్రశాంత్‌కి హోస్ట్ నాగార్జున ఒక మొక్క ఇచ్చాడు.

అయితే దాన్ని ప్రశాంత్ సరిగా పట్టించుకోకపోవడంతో అది ఆకులు రాలిపోయి, పూర్తిగా వాడిపోయింది.ఇప్పుడు అదే విషయాన్ని చెప్పిన నాగార్జున. మొక్కనే సరిగా చూసుకోలేకపోయావ్ నువ్వు రైతుబిడ్డవా? అని అన్నాడు.దీంతో ప్రశాంత్ ముఖం మాడిపోయింది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

నాగార్జున అడిగిన ప్రశ్నకు ఏం మాట్లాడాలో తెలియక ప్రశాంత్ బిక్క ముఖం వేశాడు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు