మీరు ఆట ఆడటం లేదు.. ఈ వీక్ డైరెక్ట్ నామినేట్ చేస్తున్నా.. ఆ ఇద్దరికీ షాకిచ్చిన నాగార్జున!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారతాయి, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అంచనా వేయడం చాలా కష్టం.

మరి ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయంలో ఎప్పుడు ప్రేక్షకుల అంచనాలు తప్పు అని నిరూపిస్తుంటారు షో నిర్వాహకులు.

ఇలా ఉంటే బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హోస్ట్ నాగార్జున ఇద్దరు కంటెస్టెంట్స్‌ని బయటికి పంపించడానికి నామినేట్ చేశారు.బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అలా ప్రకటించడంతో ఊహించని నామినేషన్ ఎదురైంది.

కాగా గతవారం 9 మంది కంటెస్టెంట్లను సోఫా వెనకాల నిల్చోబెట్టి ఫుల్ గా క్లాస్ పీకిన విషయం తెలిసిందే.ఆ 9 మంది లో నుంచి ఇప్పటికే షాని, అభినయశ్రీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత శ్రీహాన్, సచల ఆటతీరు బాగా ఉండటంతో వారిని మెచ్చుకొని మళ్ళీ సోఫాలో ఉన్న కూర్చోబెట్టారు నాగ్.అనంతరం ఒక్కొక్క కంటెస్టెంట్ గత వారంలో చేసిన తప్పులన్నీ బయట పెడుతూ వారికి ఫుల్ గా క్లాస్ పీకాడు.

Advertisement

ఇక చివరిగా సోఫా వెనుకాల వాసంతీ, బాలాదిత్య, చంటి, సుదీప, అర్జున్‌, రాజ్‌, రోహిత్‌ అండ్‌ మెరీనా, కీర్తిలు నిలబడగా అప్పుడు హోస్ట్‌ నాగార్జున వారికి ఒక విషయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.

సోఫా వెనుకాల నిలబడిన ఆ 8 మందిలోనుంచి తాను ఇద్దరిని నేను వచ్చేవారం ఎలిమేట్‌ని నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ ఊహించని విధంగా షాక్ ని ఇచ్చాడు నాగార్జున.బిగ్‌బాస్‌ చరిత్రలోనే కంటెస్టెంట్స్‌ని హోస్ట్‌ నామినేట్‌ చేయడం తొలిసారి అని చెబుతూనే ఆ ఇద్దరిని ఎంచుకోవాల్సిన బాధ్యత సోఫాలో కూర్చున్న కంటెస్టెంట్స్‌ కీ అప్పజెప్పాడు.అప్పుడు ఇంటి సభ్యులు అందరు కలిసి నిర్వహించిన ఓటింగ్‌లో చంటికి 1, రాజ్‌కు 4, అర్జున్‌కు 5, బాలాదిత్యకు 3, వాసంతికి2, రోహిత్‌ అండ్‌ మెరీనాలకు 1, సుదీపకి 3, కీర్తి భట్‌కు 5 ఓట్లు వచ్చాయి.

ఈ ఓటింగ్ లో అత్యధిక ఓట్లు వచ్చిన అర్జున్, కీర్తి,లను నాగార్జున నేరుగా నామినేట్‌ చేశారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు