Bichagadu 2 : జైలర్ కంటే బిచ్చగాడే తోపు.. ఈ మూవీ బుల్లితెర రేటింగ్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

విజయ్ ఆంటోనీ( Vijay Antony ) హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా గురించి మనందరికీ తెలిసిందే.

అప్పట్లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా సంచలన రికార్డును సృష్టించింది.ఆ మూవీ సాధించిన రేటింగ్స్ ను టాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఒక దశలో అందుకోలేకపోయారు.

అయితే ఇప్పుడు బిచ్చగాడు-2 వంతు వచ్చింది.ఈ సినిమా థియేటర్ లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు.

కానీ టీవీల్లో మాత్రం ఈ ఫ్రాంచైజీ హవా కొనసాగింది.

Advertisement

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బిచ్చగాడు-2( Bichagadu 2 )ను టెలికాస్ట్ చేస్తే, ఏకంగా 6.97 రేటింగ్ వచ్చింది.ఇది కూడా ఒక లెక్కేనా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పెద్ద లెక్కే అని చెప్పవచ్చు.

ఇంకా చెప్పాలంటే ఇటీవలే విడుదల అయిన రజినీకాంత్ జైలర్ సినిమా కంటే బిచ్చగాడు సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది.సినిమాకు అన్ని తానై బిచ్చగాడు 2 సినిమాను తెరకెక్కించారు విజయ్ ఆంటోనీ.

సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు హీరోగా నటించి కథ అతనే రాసుకొని స్వయంగా సంగీతాన్ని అందించి తనే ఎడిటింగ్ చేసుకున్నాడు.ఇలా ప్రతి ఒక్కటి తనే స్వయంగా చేసుకున్నారు విజయ్ ఆంటోని.

అంతేకాకుండా ఈ సినిమాకు నిర్మాత కూడా విజయ్ ఆంటోనినే.15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.అంతేకాకుండా వసూళ్ల మోత మోగించింది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

బిచ్చగాడు పార్ట్ వన్ విడుదల అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేయగా పార్ట్-2 విడుదల అంతకు రెట్టింపు విజయాన్ని సాధించింది.అటు వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా భారీగా ప్రేక్షకాధరణను పొందింది.

Advertisement

తాజా వార్తలు