ఖుషి సినిమాలో తన నటనపై భూమిక చేసిన కామెంట్ ఏంటో తెలుసా?

ఖుషి. తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ మూవీ.

2001లో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించిన ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా కనిపించింది.మామూలు పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ గా మార్చింది ఈ సినిమా.

ఈ సినిమాతో భూమిక తెలుగు ప్రజల కలల రాణిగా మారిపోయింది.మణిశర్మ సంగీతం ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ గా మారింది.

ఈ సినిమా పాటలు సంగీత ప్రియులను మైమరిపించాయి.ఈ చిత్రం జనాలకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది.

Advertisement
Bhumika Comments On Khushi Movie,Actress Bhumika, Khushi Movie,Jyothika, Bhumika

ఇగో ఇద్దరు ప్రేమికుల మధ్య ఎలాంటి ఎడబాటును కలిగించింది అనేది ఈ సినిమాలో తెలుస్తుంది.చివరకు వీరిద్దరు కలవడంతో సినిమాకు శుభంకార్డు పడుతుంది.

ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

Bhumika Comments On Khushi Movie,actress Bhumika, Khushi Movie,jyothika, Bhumika

నిజానికి ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది.తొలుత ఈ సినిమాను తమిళంలో విజయ్, జ్యోతిక నటించారు.అక్కడ సూపర్ హిట్ అయ్యాక.

ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించాడు ఎస్ జే సూర్య.ఎంఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాడు.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

ఈ సినిమాకు హీరోయిన్ గా భూమికను సెలెక్ట్ చేసినప్పుడు ఆమె తమిళంలో వచ్చిన ఈ సినిమాను చూసింది.అందులో జ్యోతిక క్యారెక్టర్ తో పాటు యాక్టింగ్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

తెలుగులో ఆమె క్యారెక్టర్ పేరు మధు అని పెట్టారు.ఆ పాత్రను చాలా ఇష్టపడింది భూమిక.

తెలుగు ఖుషి సినిమా రిలీజ్ అయ్యాక.భూమిక మరోసారి చూసింది.ఒరిజినల్ సినిమాతో పాటు రీమేక్ సినిమాలో ఏ హీరోయిన్ బాగా నటించింది? అనే ప్రశ్న సాధారణ జనాలతో పాటు తనకు కూడా వచ్చిందని చెప్పింది భూమిక.అయితే భూమిక జ్యోతికతో పోటీ పడి నటించిందని జనాలు అభిప్రాయపడ్డారు.

కానీ భూమికకు మాత్రం తన కంటే జ్యోతికనే అద్భుతంగా చేసిందని చెప్పింది.అటు ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సైతం చాలా అద్భుతంగా నటించాడని చెప్పింది భూమిక.

తాజా వార్తలు